Telangana: రుణ మాఫీపై మాట మార్చిన కాంగ్రెస్
Telangana: తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఈ అంశంపై మాట మార్చారు. అధికారంలోకి వచ్చిన రోజే రుణ మాఫీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఈ మాట అన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి (Revuri Prakash Reddy). అధికారంలోకి వచ్చిన రోజే రుణ మాఫీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని.. రుణ మాఫీ చేయాలంటే తమకు సంవత్సరం సమయం కావాలంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేసారు.