Congress: 2 హామీలపై తెలంగాణ కాంగ్రెస్ యూ టర్న్..!
Congress: అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేస్తామని చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు షాక్ ఇచ్చే ప్రక్రియలు మొదలుపెట్టింది. ఆరు హామీల్లో ఇప్పటికే రెండు హామీలపై యూటర్న్ తీసుకుంది. ప్రజా దర్బార్‌ను గత ప్రభుత్వంలా ప్రజా వాణి అని సంబోధించాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్.. మంగళవారం, శుక్రవారాల్లో మాత్రమే ప్రజల బాధలు తెలుసుకుంటామని అంటున్నారు.
అది కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారట. ఇక రెండో అంశం ఏంటంటే… గతంలో BRS ప్రభుత్వం ఇస్తున్న రూ.10,000 రైతు బంధునే ఇప్పుడు కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. కానీ ఇంకా ఈ విషయంలో ప్రొసీజర్‌లు ఓ కొలిక్కి రాకపోవడంతో పాత ప్రభుత్వ విధానాన్నే ప్రస్తుతం అమల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.