Telangana Congress: ఎంపీ ఎన్నిక‌ల్లో ఓడిపోతే ఉచిత బ‌స్సు ప‌థ‌కం నిలిపివేత‌

Telangana Congress: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణ‌లో అమ‌ల్లో ఉన్న ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఆగిపోతుంద‌ని అన్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న చేసిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఈ మాట అన్నారు. దాంతో ప్ర‌జ‌లు ఇదేం రాజ‌కీయం అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పొన్నం ప్ర‌భాక‌ర్ ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబ‌ట్టే తెలంగాణ మ‌హిళలు హాయిగా ఉచితంగా ప్ర‌యాణం చేస్తున్నార‌ని.. ఇంత‌టి మంచి ప‌థ‌కాన్ని అందించిన కాంగ్రెస్‌ను ఓడిపోవాలా? అని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. ఒక‌వేళ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ ఓడిపోతే ఆ ప‌థ‌కం ఆగిపోతుంద‌ని తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌కు తెలీదా అని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

ALSO READ:

Revanth Reddy: సీఎం ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాత్ర‌మే అర్హుడు