Congress: చిన్నోళ్లే కానీ గ‌ట్టోళ్లు..!

Congress: ఇప్పుడు తెలంగాణ‌లో ఇద్ద‌రు యువ నేత‌లు ఉన్నారు. ఆ ఇద్ద‌రూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన‌వారే. పైగా ఇద్ద‌రికీ ఇది తొలి పోటీనే. అయినా భారీ మెజారిటీతో గెలిచారంటే సాహ‌స‌మ‌నే చెప్పాలి. ఒక‌రు అత్త వ‌దిలిన బాణం.. మ‌రొక‌రు తండ్రి మార్గంలో న‌డిచిన త‌న‌యుడు. వారెవ‌రో ఈపాటికి మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది. ఒక‌రు పాల‌కుర్తి నుంచి పోటీ చేసి గెలిచిన య‌శ‌స్విని రెడ్డి..(yashaswini reddy)  మ‌రొక‌రు మెద‌క్ నుంచి పోటీ చేసి గెలిచిన మైనంప‌ల్లి రోహిత్ రావు (mynampally rohit rao).

నిజానికి పాల‌కుర్తి నుంచి ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆమెకు అమెరికా పౌర‌సత్వం ఉండ‌టంతో కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌లేదు. త‌న త‌న కోడ‌లు య‌శ‌స్విని రెడ్డిని బ‌రిలోకి దింపింది. కాంగ్రెస్ వ‌య‌సులో చిన్న‌ది అని ఆలోచించ‌కుండా టికెట్ ఇచ్చింది. అలా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుపై పోటీ చేసి మ‌రీ గెలిచింది య‌శ‌స్విని రెడ్డి. ఇక మైనంప‌ల్లి రోహిత్. త‌న తండ్రి మైనంప‌ల్లి హ‌నుమంత రావు మెద‌క్ టికెట్ కోసం ఎంతో ఆరాట‌పడ్డారు. రోహిత్‌కి టికెట్ ఇవ్వాల‌ని పార్టీని కోర‌గా పార్టీ ఇవ్వలేదు. దాంతో ఆయ‌న అలిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ మైనంప‌ల్లి హ‌నుమంత‌రావుకి మ‌ల్కాజ్‌గిరి టికెట్ ఇవ్వ‌గా.. రోహిత్‌కి మెద‌క్ టికెట్ కేటాయించింది. హ‌నుమంత‌రావు ఓడిపోయిన‌ప్ప‌టికీ రోహిత్ గెలిచారు. అలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇద్ద‌రు పిన్న వ‌య‌స్కులు ఎమ్మెల్యేలుగా గెలిచి యువ‌త‌కు స్ఫూర్తిగా నిలిచారు.