Telangana Cabinet : ఇక TS కాదు TG .. !
Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) ఈరోజు కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సెక్రటేరియట్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇక నుంచి తెలంగాణను TS అని కాకుండా TG అని సంబోధించాలని.. రిజిస్ట్రేషన్ వాహనాలకు TG కూడా అనే ఉండాలని నిర్ణయించనున్నారు. దీంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అమలుకు కసరత్తుపై చర్చలు జరపనున్నారు. ఈ రెండు అంశాలతో పాటు గ్రూప్ -1 పోస్ట్‌ల భర్తీని పకడ్బందీగా నిర్వహించడానికి సన్నాహాలు చేపట్టనున్నారు. (telangana cabinet)
చెప్పింది చేసి చూపిస్తా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలోనే తెలంగాణ స్టేట్‌ను తెలంగాణగా మారుస్తానని రేవంత్ ఎన్నో సార్లు చెప్పారు. అది ఇప్పుడు చేసి చూపించబోతున్నారు. ఈ నిర్ణయంపై ఈరోజు ఆమోదం ప్రకటిస్తే ఇప్పటివరకు తెలంగాణలో TS నెంబర్ ప్లేట్‌తో ఉన్న వాహనాలన్నీ TGకి మార్చాల్సిందే.
అసలు TS అని ఎందుకు వచ్చింది?
తెలంగాణ రాష్ట్రానికి TS అనే పేరు ఎందుకు వచ్చిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే KCR ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో అదే రోజున రాష్ట్రానికి TS అని నామకరణం చేసారు. తెలంగాణ రాష్ట్రానికి TG అనే ఉండాలని కేంద్రం ఆదేశించినప్పటికీ న్యూమరాలజీ ప్రకారం అని TS ఉంటేనే బాగుంటుందని పట్టుబట్టి మరీ KCR ఈ పేరు పెట్టించారు.