Telangana: మన రాష్ట్ర సీఎంకే ఎక్కువ జీతం.. ఎందుకో తెలుసా?
Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావొస్తోంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ వయసులో చిన్నది. అలాంటి తెలంగాణ ముఖ్యమంత్రి జీతం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల జీతం కంటే ఎక్కువే. దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం కంటే తక్కువ జీతం వస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అందుకున్న జీతం నెలకు రూ.4,10,000. ప్రధాన మంత్రికి వచ్చే బేసిక్ శాలరీనే ఇందులో సగం ఉంటుంది. ప్రధాని జీతం మొత్తం లెక్కేసి చూసుకున్నా తెలంగాణ రాష్ట్ర సీఎంకు వచ్చే జీతం ఎక్కువే.
రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం ఎంత ఉండాలి అనేది ఆ రాష్ట్ర తలసరి ఆదాయం , అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఇలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.335,000. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఎందుకు ఎక్కువ జీతం అంటే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి. ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన జరిగి ఏర్పడిన రాష్ట్రం కాబట్టి తెలంగాణ సీఎం జీతం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రికి ఉండే బెనిఫిట్స్
*జీతాలతో పాటు వారికి ఒక పెద్ద భవంతిని కూడా ఇస్తారు. దీనికి సీఎం అధికారిక నివాసం అంటారు.
*ఒకవేళ సీఎం తన సొంత ఇంట్లోనే ఉంటానంటే.. ఆ ఇంటి రెంట్ ఎంతుంటే అంత సీఎం ఖాతాలో వేస్తారు.
*ఫోన్ బిల్స్ కోసమని ప్రతీ ముఖ్యమంత్రి నెల నెలా ఇంత రీయింబర్స్‌మెంట్ అని ఉంటుంది.
*అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సీఎంకు చికిత్స ఉచితం. ఈ బిల్లులను ప్రభుత్వమే చూసుకుంటుంది.
*ఇక విద్యుత్తు విషయానికొస్తే నెలకు ఇన్ని యూనిట్లు ఉచితం అని ఉంటుంది. అంతకుమించి దాటితే సీఎం చెల్లించుకుంటారు.
*ప్రయాణ ఖర్చుల కోసం కూడా కొంత మొత్తాన్ని నిర్ణయిస్తారు. దీని ద్వారా సీఎం కుటుంబం కూడా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.