BRS Manifesto: KCR కొత్త ప‌థ‌కాలు ఇవే..!

తెలంగాణ సీఎం KCR.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ ఎన్నిక‌ల‌కు (telangana elections) సంబంధించిన మేనిఫెస్టో (brs manifesto) రిలీజ్ చేసారు. ఈ మేనిఫెస్టోలో మైనార్టీల‌కు బ‌డ్జెట్ మ‌రింత పెంచ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. మైనార్టీల కోసం మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు.

మైనార్టీల జూనియ‌ర్ డిగ్రీ కాలేజీల‌ను అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌జ‌లంద‌రికీ KCR బీమా పేరుతో కొత్త ప‌థ‌కం ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ద్వారా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా పొందే అవ‌కాశం ఉంటుంది. రేష‌న్ కార్డుదారుల‌కు స‌న్న బియ్యంతో పాటు నెల‌కు పెన్ష‌న్ రూ.5 వేల వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. గిరిజ‌న నేత‌ల‌కు పోడు ప‌ట్టాలు ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. (brs manifesto)

అయితే రూ.5000 పెన్ష‌న్ అనేది ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చేది కాద‌ని..అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి సంవ‌త్స‌రం ప్ర‌స్తుతం ఉన్న రూ.2016 కాస్తా రూ.3000 పెంచి.. ఐదేళ్ల పాటు ఏటా రూ.500 పెంచుతూ ఉంటామ‌ని తెలిపారు. ఇలా చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వంపై ఆర్థిక భారం ప‌డ‌ద‌ని పేర్కొన్నారు. విక‌లాంగుల పెన్ష‌న్‌ను కూడా రూ.6000 వ‌ర‌కు పెంచ‌నున్న‌ట్ల ప్ర‌క‌టించారు.

ఈ ప‌థ‌కాన్ని కూడా ఒకేసారి కాకుండా.. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 2024 మార్చిలో రూ.5000 ఇచ్చి ఆ త‌ర్వాత ప్ర‌తి సంవ‌త్సరం రూ.300 పెంచుకుంటూ వెళ్తామ‌ని పేర్కొన్నారు. రైతు బంధు ప‌థ‌కాన్ని రూ.12000 నుంచి రూ.16000 వ‌ర‌కు పెంచారు. అర్హులైన మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.3000 భృతి ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ స్కీంకు సౌభాగ్య ల‌క్ష్మి అని నామ‌క‌రణం చేసారు. అర్హులైన వారికి, అక్రిడేష‌న్ క‌లిగిన‌ జ‌ర్న‌లిస్ట్‌ల‌కు రూ.400ల‌కే సిలిండ‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆరోగ్యశ్రీ పథ‌కం కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కే బీమా వ‌ర్తించేదని ఇప్పుడు దానిని రూ.15 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. (brs manifesto)

‘అగ్రవర్ణ పేద పిల్లలకు’ 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయం. నిర్ణయించారు. అసైన్డ్ భూములకు ఆంక్షలను ఎత్తివేసి అమ్ముకునే హ‌క్కులు క‌ల్పించ‌నున్నారు. EPS ప‌రిధిలో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు పాత పెన్ష‌న్ విధానాన్నే కొన‌సాగించాల‌ని కోరుతున్నార‌ని దీనిపై ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల్లాగా వెంట‌నే నిర్ణ‌యాలు తీసుకుంటే బ్యాక్‌ఫైర్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని KCR తెలిపారు. ఇందుకోసం ఓ ప్ర‌త్యేక అధ్య‌య‌న క‌మిటీని పెట్టి అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. (brs manifesto)