Telangana BJP: ఎన్నిక‌ల‌కు ముందు… వాస్తు ప్ర‌కారం మీటింగ్స్

వాస్తు శాస్త్రాన్ని బాగా న‌మ్మేవారు ఉంటారు. అలాంటివారు రాజ‌కీయాల్లో కూడా ఉంటారు. ముఖ్యంగా BJPలో (telangana bjp). అందుకే ఎప్పుడు మీటింగ్స్ జ‌రిగినా వాస్తు శాస్త్ర నిపుణుడిని సంప్ర‌దించి మ‌రీ మీటింగ్‌ల‌కు వెళ్తున్నార‌ట‌. తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఏవైనా మీటింగ్స్‌, ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లు జ‌రిగిన‌ప్పుడు కొంద‌రు BJP నేత‌లు ఈశాన్య దిశ‌గా కూర్చుకుంటున్నార‌ట‌. ఆ దిశ‌గా ఇంకెవరైనా కూర్చుంటే వారిని లేపి మ‌రీ కూర్చుంటున్నార‌ట‌.

గ‌తంలో ప‌లువురు తెలంగాణ BJP నేత‌లు మీటింగ్‌ల‌లో నైరుతి వైపు కూర్చుండేవార‌ట‌. అలా కూర్చుంటే వాస్తు ప్ర‌కారం డ‌బ్బు వృథా అవుతుంద‌ని నిపుణులు చెప్ప‌డంలో మార్పులు చేసుకున్నార‌ని ఓ నేత మీడియా ద్వారా వెల్ల‌డించారు. మీడియాకు అన్ని విష‌యాలు చెప్తాం కాబట్టి ఈ విష‌యం కూడా షేర్ చేసుకోవాల‌ని అనుకున్నామని అన్నారు. మీటింగ్స్ జ‌రిగే ఆఫీస్‌ల‌లోని గోడ‌ల‌కు వాస్తు ప్ర‌కారం లాభం చేకూర్చే పెయింటింగ్స్ వేయించ‌డం, రూఫింగ్స్ మార్పించ‌డం వంటివి ప‌నులు కూడా చేస్తున్నారు. (telangana bjp)