Telangana Assembly: నువ్వు నాకు నేర్పిస్తావా? హరీష్ రావుపై స్పీకర్ ఆగ్రహం
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్.. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుపై భారత రాష్ట్ర సమితి మాట్లాడటంలేదని వారి మైక్ని కట్ చేసారు. దీని గురించి మాట్లాడితేనే మైక్ ఇస్తానని స్పీకర్ అన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ రూల్ మీరే మర్చిపోతే ఎలా అధ్యక్షా అని ప్రశ్నించారు. దీనికి స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను ఎలా నడుచుకోవాలో మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. అని మండిపడ్డారు.