Chandrayaan 3: TDP పెట్టిన వైర‌ల్ ఫోటో!

ఈ మ‌ధ్య‌కాలంలో TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఏ స‌మావేశానికి వెళ్లినా అది నేనే చేసాను ఇది నేనే చేసాను అని నిర్మొహ‌మాటంగా చెప్పుకుంటున్నారు. ఒక‌వేళ ఆయ‌నే నిజంగా చేసినా కూడా క్రెడిట్ ఇవ్వ‌డానికి ఇత‌ర పార్టీలు ఒప్పుకోవ‌డంలేదు. అయితే నిన్న చంద్ర‌యాన్-3 (chandrayaan 3) సక్సెస్ అయిన సంద‌ర్భంగా TDP పోస్ట్ చేసిన ఫోటో వైర‌ల్ అవుతోంది. 1960ల కాలంలో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు రాకెట్ల‌ను సైకిల్‌పై మోసుకెళ్లేవారు. ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ సైకిల్‌పై ఎలా స్టార్ట్ అయ్యిందో చూడండి..! అని ట్వీట్ చేసారు.

దాంతో ఊహించిన‌ట్లుగానే.. చంద్ర‌యాన్ స‌క్సెస్‌ను కూడా చంద్ర‌బాబు త‌న ఖాతాలో వేసుకుంటున్నారు అంటూ సెటైర్లు మొద‌లైపోయాయి. కనీసం TDP పార్టీ పోస్ట్ చేసిన ఫోటోలో ఒక అర్థం ఉంది. మొన్న  YSRCP నాయ‌కుడు ఒక‌రు.. ఏపీలోని శ్రీహ‌రికోట‌లో చంద్ర‌యాన్-3ని లాంచ్ చేసి ఆ రాష్ట్ర సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు వ‌చ్చేలా జ‌గ‌న్‌యాన్ అని పెట్ట‌కుండా చంద్ర‌బాబు నాయుడు పేరు వ‌చ్చేలా చంద్ర‌యాన్ అని ఇస్రో పెట్టడం బాధాక‌రం అని పోస్ట్ వేసాడు.  (chandrayaan 3)