తెలంగాణ‌లో స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న TDP

tdp to contest in local telangana elections

TDP: తెలంగాణ‌కు చెందిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇక నుంచి తెలుగు దేశం పార్టీ కూడా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. నిన్న హైదరాబాద్‌లో TTDP నాయకులతో సమావేశమైన చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.