Telangana Elections: కాంగ్రెస్ పార్టీ తరపున TDP ప్రచారం!

తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) TDP పోటీ చేయ‌డంలేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే TDP పోటీలో లేనప్ప‌టికీ ఇక్క‌డ కాంగ్రెస్ త‌ర‌ఫు ప్ర‌చారం చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ TPCC అద్యక్షుడు రేవంత్ రెడ్డిని (revanth reddy) ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్య‌క్షుడు కొలికపూడి శ్రీనివాసరావు (kolikapudi srinivas rao) క‌లిసారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కొలికపూడి శ్రీనివాస్ రావుతో పాటు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిలోని మరికొందరు కూడా ప్రచారంకు హాజరు కానున్న‌ట్లు స‌మాచారం.