AP Election: విజయ దశమి నాడు అభ్యర్ధుల ప్రకటన?
AP: ఏపీ ఎన్నికలు (ap election) దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ TDP త్వరలో మేనిఫెస్టోను, మొదటి అభ్యర్ధుల జాబితాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన TDP ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో రానన్న ఎన్నికల్లోనూ మళ్లీ పదవి చేజిక్కించుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టోను ప్రకటించేసిన TDP ఇప్పుడు మొదటి అభ్యర్ధుల జాబితాను ప్రవేశపెట్టనుంది. విజయ దశమి రోజున చంద్రబాబు (chandrababu naidu) మెయిన్ మేనిఫెస్టోను, అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకోసారి 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లకు గానూ TDP సర్వేలు చేపడుతోందట. ఈ సర్వేల ఫలితాల ప్రకారమే అభ్యర్ధులను ఎంపికచేయనున్నారు. చూడబోతే ఎన్నికల (ap election) నేపథ్యంలో TDP ప్రిపేర్ అయినట్లుగానే కనిపిస్తోంది కానీ పొత్తుల విషయంలోనే ఏ విషయం అనేది తేల్చి చెప్పలేకపోతున్నారు. ఓపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఏమో పొత్తు పెట్టుకుందామన్నా ఒకే లేదా ఒంటరిగా పోటీ చేద్దామన్నా ఓకే అంటూ కార్యకర్తలతో చెప్తున్నారు.