Chandrababu Naidu: జైల్లో బాబు.. రోడ్డుపై భార్య‌..!

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌కు నిర‌స‌న‌గా.. గాంధీ జ‌యంతి (gandhi jayanthi) సంద‌ర్భంగా TDP కార్య‌క‌ర్త‌లు ఈరోజ నిరాహార దీక్ష చేయ‌నున్నారు. చంద్ర‌బాబు నాయుడు రాజమండ్రి సెంట్ర‌ల్ జైలులో దీక్ష చేప‌డ‌తారు. ఆయ‌న స‌తీమ‌ణి నారా భువనేశ్వ‌రి (nara bhuvaneswari) రాజ‌మండ్రి కోరుకొండ రోడ్డులో నిరాహార దీక్ష చేస్తారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ (nara lokesh) అక్కడ త‌న‌తో పాటున్న మంత్రుల‌తో క‌లిసి దీక్ష‌లో పాల్గొంటారు. ఇలా ఏపీ మొత్తంలో TDP శ్రేణులు దీక్ష‌ల్లో పాల్గొంటారు. సాయంత్రం 7 గంట‌ల‌కు కొవ్వొత్తులు వెలిగించి నిర‌స‌న వ్య‌క్తం చేయాల‌ని పిలుపునిచ్చారు.