Chandrababu Arrest: APలో అల్ల‌క‌ల్లోలం

TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu arrest) అరెస్ట్‌లో ఏపీలో అల్ల‌క‌ల్లోలం జ‌రుగుతోంది. TDP కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున ధ‌ర్నాలు చేస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ దిష్టిబొమ్మ‌ల‌ను త‌గ‌ల‌బెట్టి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. గుంటూరు- తెనాలి ర‌హ‌దారిపై బైఠాయించి ధ‌ర్నాలు చేస్తున్నారు. హిందూపురంలో వాహ‌నాలు ద‌గ్ధం చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు. విజ‌య‌వాడ హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహ‌రించారు. ప‌లువురిని అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. (chandrababu arrest)