TDP: కామాంధుడు బాలయ్య కాదు.. హోటల్‌లో గడిపిన వ్యక్తి
TDP: ప్రముఖ తమిళ నటి వెన్నీరా అడై నిర్మల (Vennira Adai Nirmala) ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఓ సినిమాలో నటించిన గొప్ప నటుడి కుమారుడు రాత్రి వేళలో తన తలుపు తట్టాడని.. తనకంటే వయసులో చిన్నవాడైన ఆ హీరో ఇలా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదని వెల్లడించారు. దాంతో ఆమె మాట్లాడేది నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించే అంటూ ప్రచారం మొదలైంది. (TDP)
దాంతో ఇదే కరెక్ట్ సమయం అని YSRCP అధికారిక సోషల్ మీడియా ద్వారా బాలయ్యపై దాడులు మొదలుపెట్టింది. పేరుకేమో తెరపై అతను హీరో.. కానీ తెరచాటున మహిళల్ని లైంగికంగా వేధించే కామాంధుడు. అవుట్ డోర్ షూటింగ్స్‌లో అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల రూము దగ్గరికి వెళ్లి డోర్ కొట్టడం నందమూరి బాలకృష్ణకి అలవాటు. ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర తదితర హీరోయిన్లు తమని బాలయ్య వేధించిన తీరుని ఏకరువు పెట్టారు. 1975లో విడుదలైన అన్నదమ్ముల అనుబంధం సినిమా షూటింగ్ సమయంలో తన కంటే 13 ఏళ్లు వయసులో పెద్ద అయిన వెన్నిరాడై నిర్మలను కూడా బాలయ్య అర్ధరాత్రిళ్లు ఏడిపించాడట. సినిమాల్లో స్త్రీ జనోద్ధారకుడిగా ఫోజులు కొడతాడు.. కానీ చేసేవి అన్నీ నీచ పనులే. ఎంత చిల్లర బతుకులు మీ నాయకుడివి. మీ ఇంట్లోని ఆడవాళ్లే మహిళలా.. మిగిలిన వాళ్లంటే అంత చులకనా..? అని ట్వీట్ చేసింది YSRCP ట్విటర్ హ్యాండిల్.
ALSO READ: Vennira Adai Nirmala షాకింగ్ కామెంట్స్.. బాలయ్య గురించేనా?
దీనికి వెంటనే తెలుగు దేశం పార్టీ ట్విటర్ హ్యాండిల్ నుంచి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. నిర్మల బాలయ్య గురించి అదే ఇంటర్వ్యూలో ఎంత గొప్పగా చెప్పారో వీడియో జత చేస్తూ ఇలా కౌంటర్ ఇచ్చింది. నకిలీ ఫెలో… చెప్పుకోవటానికి ఏమి లేక, కేవలం ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుని, ఎలక్షన్ కి వెళ్తున్నాడు. నువ్వు వేసిన వీడియోలో, ఎక్కడైనా బాలయ్య పేరు ఉందా ? ఇలా ఆపాదించాలి అనుకుంటే, మీ పార్టీలో చాలా మంది జబర్దస్త్ ఆటగాళ్ళు ఉన్నారు. నిర్మల గారు బాలయ్య వ్యక్తిత్వం గురించి ఏమి చెప్తున్నారో ఈ వీడియోలో విను. అయినా నువ్వు చెప్తున్న కామాంధుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా ? తండ్రి చనిపోయాడని తెలిసినా, రెండు రోజులు వరకు రాకుండా, కలకత్తా హోటల్ లో గడిపిన సైకోలా ఉంటాడు అని కామెంట్ చేసారు.
ఎన్నికల ముందు బాలయ్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇలా ట్రోల్ అవడం చర్చనీయాంశంగా మారింది. వెన్నీరా అడై నిర్మల ఏ హీరో గురించి ఇలా మాట్లాడారో ఇప్పటికైనా చెప్పాలని లేకపోతే అందరూ బాలయ్యనే ఆడిపోసుకుంటారని ఆయన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.