TDP: తాడేపల్లి నుంచి బెంగుళూరు ప్యాలెస్‌కు పారిపోవడం ఖాయం
TDP: ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి (Jagan Mohan Reddy) తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరు ప్యాలెస్‌కు పారిపోవడం ఖాయం అని అన్నారు తెలుగు దేశం పార్టీ ప్రజా ప్రతినిధి నాగుల్ మీరా.
తాడేపల్లి గూడెంలో జరిగిన TDP – జనసేన ఉమ్మడి భారీ బహిరంగసభకు వచ్చిన జనసందోహాన్ని చూసి తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని, కిక్కిరిసిన ఇరుపార్టీల అభిమానుల మధ్య సభాస్థలికి రావడానికి ప్రజలు 3, 4 గంటల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని, సభకు లక్షలాదిగా తరలి వచ్చిన అభిమానుల్ని ప్రత్యక్షంగా చూసి ఎంతగానో సంతోషించానని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం..!
జగన్ రెడ్డి సిద్ధంసభలకు YSRCP కార్యకర్తల్ని తరలించడానికే ఆ పార్టీ నేతలు నానా అవస్థలు పడుతుంటే, మరోపక్క చంద్రబాబు : పవన్ కల్యాణ్ సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడం నిజంగా సంతోషించాల్సిన విషయం. దుర్మార్గపు ముఖ్యమంత్రిని, దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపాలనే ధృఢచిత్తంతో ప్రజలు ఉన్నారు కాబట్టే.. చంద్రబాబు – పవన్ కల్యాణ్ సభలు కనీవినీ ఎరుగని విధంగా విజయవంతం అవుతున్నాయి.
చంద్రబాబు–పవన్ కల్యాణ్ లను పక్కపక్కనచూసిన వైసీపీనేతలు తమ పక్కలు తడుపుకున్నారన్నది కాదనలేని వాస్తవం. టీడీపీ అధినేత చెప్పినట్టు నిప్పుకు గాలి తోడైంది. రెండింటి కలయికతో వ్యాపించే దావానలంతో వైసీపీ ప్రభుత్వం కాలి బూడిదవడం ఖాయం. టీడీపీ ఎన్నిసీట్లలో పోటీచేస్తే వైసీపీకి ఎందుకు? జనసేనకు ఎన్నిస్థానాలు కేటాయిస్తే జగన్ రెడ్డి… అతని పార్టీనేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా తనపార్టీ శ్రేణులకు, ప్రజలకు చాలా స్పష్టంగా టీడీపీతో ఎందుకు కలిశారో.. ఏ పరిస్థితుల్లో కలవాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతున్నారు. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని, అవినీతి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటే ప్రజలు మెచ్చే అన్నిపార్టీలు.. వ్యక్తులు ఒకే తాటిపైకి రావాలని ఆయన పదేపదే చెబుతున్నారు.
ALSO READ: Nara Bhuvaneswari: ప్రశ్నిస్తే చంపేస్తున్నారు
జగన్ రెడ్డి తనపార్టీ అభ్యర్థుల ఎంపికను ప్రయోగశాలగా మార్చాడు. వైసీపీనేతల పరిస్థితి దారుణంగా తయారైంది. చిత్తూరు వ్యక్తిని ఒంగోలులో, నెల్లూరు అభ్యర్థిని నరసరావుపేటలో, కనిగిరి వాళ్లను నెల్లూరులో పెడుతూ, రాష్ట్రచరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాజకీయ చోద్యాలు, చిత్రాలు చూపిస్తు న్నాడు. తన పార్టీ వారు ఎక్కడపోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని తెలిసే జగన్ వైసీపీ అభ్యర్థుల ఎంపిక అనే ప్రక్రియను పబ్జీగేమ్ కంటే దారుణంగా తయారుచేశాడు. 5ఏళ్లలో సంపాదించాల్సిన దానికంటే ఎక్కువగా లక్షలకోట్లు కొట్టేశాక ఎవరుగెలిస్తే తనకేంటి..ఎవరు ఓడితే తనకేంటి అనే విధంగా జగన్ వ్యవహరిస్తున్నాడు. 5గురు రెడ్లకు రాష్ట్రాన్ని అప్పగించిన జగన్ రెడ్డి..వారితో ఇతర వర్గాలపై పెత్తనం చేయిస్తూ సామాజిక న్యాయం అంటుంటే నవ్వు ఆగడంలేదు. దళితులు, బీసీలు, మైనారిటీ వర్గాల్లో సమర్థులైన నాయకులు లేరన్న సంకుచిత మనస్త త్వంతో ఉన్న జగన్ రెడ్డి తీరుని సొంతపార్టీ నేతలే సహించలేకపోతున్నారు. వైసీపీ తరుపున పోటీచేసి ప్రజలతో ఛీ కొట్టించుకునే బదులు జగన్ రెడ్డికి దండం పెట్టి, TDP..జనసేన పార్టీల్లో చేరాలని అధికారపార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.ప్రజాస్వామ్యాన్ని, ప్రజాసంపదను, మద్యం..మైనింగ్..ఇసుక మాఫియాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేది తెలుగుదేశం-జనసేన పార్టీలేనని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
5 ఏళ్లలో కొల్లగొట్టిన అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో గెలవచ్చనే దుర్మార్గపు ఆలోచనలో జగన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు. ప్రజల చైతన్యం ధాటికి ఆయ న కలలు… ఎప్పటికీ కల్లలుగానే మిగులుతాయి. వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి… జగన్ రెడ్డికి దగ్గర కావడానికి ఏ పార్టీ, ఏ నాయకుడు సిద్ధంగా లేరు. తాడే పల్లి ప్యాలెస్ లో మహారాజులా భోగాలు అనుభవించే జగన్ రెడ్డి ప్రజల ముఖమే చూడడు.. తమ ముఖం ఏం చూస్తాడని అన్నిపార్టీల నాయకులు గ్రహించారు. జగన్ రెడ్డి అవినీతి సొమ్ముతో ప్రసారమాధ్యమాల్లో స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తుంటే, టీడీపీ-జనసేన పార్టీలు తమఛరిష్మాతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాయి.
చంద్రబాబు తమకు, తమబిడ్డలకు గతంలో చేసిన మేలుని అన్నివర్గాల ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుంటూ, ఆయన వెంట నడవడానికి సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ రెడ్డి ఊహకు కూడా అందని విధంగా వైసీపీకి ప్రజలు ఎమ్మెల్యేస్థానాలు కట్టబెట్టనున్నారు. ప్రజాతీర్పుతో ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యి… తాడేపల్లి ప్యాలె స్ నుంచి బెంగుళూరు ప్యాలెస్ కు మకాం మార్చడం ఖాయం. తనను నమ్మి, తనకు మరోసారి ఓటేయరని తెలిసే జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఒక్కఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాడు. సిద్ధం సభలు జనం లేక వెలవెల బోతుంటే, TDP..జనసేన సభలు జనప్రభంజనంతో కళకళలాడుతున్నాయి. వైసీపీనేతలు.. మంత్రులు జగన్ రెడ్డి మెప్పుకోసం చంద్రబాబు, పవన్ సభలకు జనం రావడంలేదని చెబుతూ చంకలు గుద్దుకుంటున్నారు అని నాగుల్ మీరా ఎద్దేవాచేశారు.