Jagan పరిపాలనపై TDP ఛార్జ్ షీట్.. ఆరోపణలు ఇలా!

AP:  సీఎం జ‌గ‌న్ (jagan) అధికారం చేపట్టి.. నాలుగేళ్ల పూర్తి చేసుకున్న సందర్బంగా YCP శ్రేణులు ఇవాళ సంబరాలు జరుపుకున్నాయి. మరోవైపు TDP మాత్రం.. నాలుగేళ్లు జగన్‌ పాలనపై ఛార్జ్ షీట్ ను విడుదల చేసింది. ఇందులో నాయకుల నేరాలు-ఘోరాలు, విధ్వంసాలు, విద్వేసాలు, అబద్ధాలు, మోసాలు, దుష్ప్రచారం, మాటతప్పడాలు, మడమతిప్పడాలు తప్పా ఏమీ లేదని పేర్కొంది. 4 ఏళ్లలో ఊహించనదానికంటే ఎక్కువ సంపాదించుకున్నామన్న ఆనందంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పాలనపై సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ నేతల ఎద్దేవా చేశారు.

“జగన్మోహన్ రెడ్డి 2019 మే30న ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల పాలనచూస్తే ఏమున్నది గర్వకారణం? ఎటుచూసినా నేరాలు-ఘోరాలు, లూఠీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలు. వీటన్నింటిని కలిపి తననివాసంలో బిక్కుబిక్కుమంటూ గడిపేపరిస్థితి తనకుతానే తీసుకొచ్చుకున్నారు ముఖ్యమంత్రి, ఎటునుంచి పోలీసులు వస్తారో, సీబీఐ వస్తుందో అని అభద్రతా భావంలో ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.

దశలవారీ మద్యపాన నిషేధం అని చెప్పి, మద్యాన్ని వ్యాపారంగా జగన్‌ మార్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య అనే కుట్రలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. దళితులు మొదలుకుని ఏ వర్గం సంతోషంగా లేరని అన్నారు. ఇసుక కొత్త విధానం పేరుతో ఎమ్మెల్యేలు, నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రులు మాట్లాడేది వింటుంటే అవి నోళ్లా, డ్రైనేజ్ లా అనిపిస్తోందని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ప్రజల్ని, రాష్ట్రాన్ని ఎలా బాగుచేయాలో తెలియదా? అని పేర్కొన్నారు.

నాలుగేళ్లలో జగన్ దేశంలోనే అపరకుబేరుడయ్యాడని, పేదవాడు తిండికిలేని దుస్థితికి దిగజారిపోయారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. “ జగన్మోహన్ రెడ్డి తన 4 ఏళ్ల పాలనలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఖ్యాతిగడించారని, రాష్ట్రంలోని పేదలు తిండికోసం పాకులాడే దుస్థితికి దిగజారిపోయాన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్, భూకబ్జాలతో జగన్ లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు.