AP Elections: YCP వాలంటీర్ల‌ను వాడుకుని TDP ప్ర‌చారం!

AP Elections: YCP వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుబ‌ట్టి వారిని నానా మాట‌లు అన్న తెలుగు దేశం పార్టీ (TDP) ఇప్పుడు అదే వాలంటీర్లను ప్ర‌చారం వాడుకుంటోంది. రానున్న ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీని గెలిపిస్తే YCP కన్నా అరగంట ముందే పెన్షన్ వేయిస్తాం అని తెలుగు దేశం పార్టీ నియ‌మించిన వాలంటీర్లు ఓట‌ర్ల‌కు చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని అయిదేళ్లు నానా మాటలు తిట్టేసి ఇప్పుడు గెలిపిస్తే అదే వాలంటీర్లతో పెన్షన్ ఇంకా త్వరగా ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు తెలుగు దేశం పార్టీ నేత‌ల‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి.