TDP NRI: ఏపీ సీఐడీ అరాచకం.. తల్లి కోసం వస్తే అరెస్ట్

TDP NRI: అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తుదారుడు య‌ష్ బొడ్డులూరిని (yash bodduluri) ఏపీ సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. య‌ష్‌పై పాత కేసులు ఉన్నాయ‌ని.. ఆయ‌న ఎప్పుడు ఇండియాకి వ‌చ్చినా స‌మాచారం అందించాల‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు.

యష్ హైద‌రాబాద్‌కు చేరుకోగానే ఎయిర్‌పోర్ట్ అధికారులు సీఐడి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దాంతో వారు యష్‌ను అదుపులోకి తీసుకున్నారు. య‌ష్ త‌ల్లి అనారోగ్యంతో ఉన్నార‌ని అందుకే వ‌చ్చాన‌ని య‌ష్ వాపోయారు. త‌ల్లి ద‌గ్గ‌రికి కూడా వెళ్ల‌నివ్వ‌కుండా త‌మ ఆధీనంలో పెట్టుకున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అమెరికాలో ఉంటూనే సోష‌ల్ మీడియాలో YSRCP ప్ర‌భుత్వం గురించి త‌ప్పుడు పోస్ట్‌లు పెడుతున్నార‌ని ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయ‌ని సీఐడి అధికారులు చెప్తున్నారు. య‌ష్‌కు CRPC 41A సెక్ష‌న్‌ ప్ర‌కారం నోటీసులు కూడా ఇచ్చామ‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం య‌ష్‌ను గుంటూరు సీఐడి కార్యాల‌యానికి త‌ర‌లించారు. య‌ష్‌ను వెంట‌నే రిలీజ్ చేయాల‌ని TDP మాజీ మంత్రి దేవినేని ఉమ (devineni uma) నిర‌స‌న వ్య‌క్తం చేసారు. త‌న‌కు తెలిసిన న్యాయ‌వాదుల‌ను గుంటూరు సీఐడి కార్యాల‌యానికి తీసుకెళ్లి ధ‌ర్నా చేప‌ట్టారు.