Pattabhiram: జగన్ 16 నెలలు జైల్లో ఉంటే చంద్రబాబు 16 గంటలు ఉండాలా?
చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు తాను ఏ తప్పూ చేయలేదని ఎంత చెప్తున్నా వారు వినినించుకోలేదని TDP జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం (pattabhiram) తెలిపారు. చంద్రబాబు నాయుడిని ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఆయన్ను అరెస్ట్ చేసారని ఆరోపించారు.
“” అసలు చంద్రబాబు నాయుడు ఏం చేసారని ఏపీ సీఎం జగన్ అరెస్ట్ చేయించారు. ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ప్రారంభించి యువతకు ట్రైనింగ్ ఉద్యోగాలు ఇప్పించడం తప్పా. స్కిల్ డెవలప్‌మెంట్ కంపెనీ ఏదో ఐటీ ట్యాక్స్ ఎగ్గొడితే అది చంద్రబాబు నాయుడు చేసినట్లు ఎలా అవుతుంది? ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా జగన్ ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారని చంద్రబాబు కనీసం 16 గంటలైనా జైల్లో ఉండాలని అనుకుంటున్నారు. ఎన్నో కేసులు ఉండి బెయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి ఓ నిజాయతీగా ఉన్న నాయకుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించడం ఏంటి. ఇందుకు ఏపీ ప్రజలే జగన్‌కు గట్టిగా బుద్ధిచెప్తారు. రానున్న ఎన్నికల్లో జగన్ మళ్లీ వచ్చే సమస్యే లేదు. అధికారం చంద్రబాబుదే. మళ్లీ ఏపీ ప్రజలను కాపాడేది చంద్రబాబే. జగన్.. ఇది నువ్వు గుర్తుపెట్టుకో “” అని తెలిపారు పట్టాభిరామ్ (pattabhiram)