Gorantla: కేంద్ర నిధులు నీ బాబుగాడి సొత్తా…!

Gorantla: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు అవేమైనా నీ బాబు గాడి సొత్తా అంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (jagan mohan reddy) ధ్వ‌జమెత్తారు తెలుగు దేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌ల ముందు చెడ్డ‌వారిగా నిరూపించి వారికి టికెట్ల ఇవ్వ‌కుండా కొంద‌రిని ఇంటికి పంపించి మ‌రికొంద‌రికి స్థాన‌చ‌ల‌నం చేసి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని మండిప‌డ్డారు. సొంత పార్టీ సర్పంచ్‌లే ఇలాంటి నేత త‌మ‌కు వ‌ద్దు అని బోరున విల‌పిస్తున్నార‌ని.. ఇలాంటి అవినీతి సీఎం ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేడ‌ని విమ‌ర్శించారు.