AP Elections: BJPతో పొత్తు వద్దంటున్న TDP నేతలు?
AP: రానున్న ఏపీ ఎన్నికల్లో (ap elections) TDP జనసేన పార్టీలు BJPతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలనుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయం మాట్లాడేందుకే కొన్ని రోజుల క్రితం TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu).. కేంద్రమంత్రులు అమిత్ షా (amit shah), జేపీ నడ్డాలను దిల్లీలో కలిసి వచ్చారు. అయితే BJPతో పొత్తుకు TDP నేతలు ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. APకి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన బీజేపీతో పొత్తులు అవసరమా అని సీనియర్ నేతలు చంద్రబాబుతో అన్నారట. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో గెలవడం కష్టమని, మళ్లీ అధికారం వైసీపీకే వెళ్తుందని కూడా హెచ్చరిస్తున్నారట. దాంతో పొత్తుకు పోవాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లోనూ బీజేపీ మాయలో పడే చంద్రబాబు ఓడిపోయారని గుర్తుచేస్తున్నారు.
మరోపక్క అటు అధికార YCP కూడా పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. మోదీ ప్రభుత్వం YCPకి ఆర్థిక సాయం చేస్తోంది. అలాంటి బీజేపీని ఎలా నమ్మి పొత్తు పెట్టుకుంటారని సొంత పార్టీ నుంచే చంద్రబాబుకి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో (karnataka elections) ఘోర పరాజయం రుచి చూసిన BJPకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని గ్రహించిన ప్రజలు ఆ పార్టీకి మాత్రం మద్దతు తెలపాలని అనుకోవడంలేదు. ఏదేమైనా బీజేపీతో పొత్తు ఉందా లేదా అన్నది చంద్రబాబు త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.