Kollu Ravindra: జ‌గ‌న్‌కి ఏమాత్రం సిగ్గున్నా ఈ విష‌యంలో సంతోషించాలి

Kollu Ravindra: లక్షలాది మంది సమక్షంలో మంగళవారం చంద్రబాబు ప్రకటించిన జయహో బీసీ డిక్లరేషన్ తో YSRCP ప్రభుత్వానికి గుండెలు అదురుతున్నాయని, మూడేళ్లపాటు గ్రామగ్రామాన అధ్యయనం చేసి, బీసీలతో మాట్లాడి.. 140కి పైగా ఉన్న బీసీ కులాల్లోని ప్రతి వర్గాన్ని సంప్రదించి టీడీపీ-జనసేన పార్టీలు ప్రకటించిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ నభూతో అన్నవిధంగా చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం….!

“””” బీసీల రిజర్వేషన్లు తగ్గించిన జగన్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 16,700 మందికి రాజ్యాంగపరమైన పదవులు దూరం చేశాడు. రూ.75వేలకోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లించాడు. బీసీవర్గాల్లో చేతి వృత్తుల్ని నమ్ముకు న్నవారికోసం చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేశాడు. ఆదరణ పనిముట్లు, పరికరాలను తుప్పుపట్టిపోయేలా చేయడానికి ముఖ్యమంత్రి ఇష్టపడ్డాడుగానీ, బీసీలకు ఇవ్వలేదు.

బీసీలపై జగన్ సాగించిన మారణహోమం ఎప్పటికీ మరువలేనిది

తన పాలనలో నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య సహా దాదాపు 300 మంది బీసీ నేతల్ని దారుణంగా చంపించిన బీసీ ద్రోహి జగన్ రెడ్డి. వేలాది మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టించి వారినిచిత్రహింసలకు గురిచేయించాడు. తన అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుకున్న చిన్నారి మణికంఠను పెట్రోల్ పోసి తగలబెట్టిన వైసీపీ దుర్మార్గుల దుర్మార్గాన్ని సమర్థించిన జగన్ రెడ్డి బీసీ వ్యతిరేక నైజాన్ని ఎప్పటికీ మరువలేం. ఈ విధంగా బీసీలపై జగన్ రెడ్డి సాగించిన మారణహోమం మాటల్లో చెప్పలేనిది.. బీసీలు ఎప్పటికీ మరువలేనిది. అలాంటి దురాగతాలు ఇకపై బీసీలపై ఎవరూ పాల్పడకుండా చేసేలా బీసీల రక్షణకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న చంద్రబాబు నిర్ణయం నిజంగా బీసీలకు గొప్ప ఆయుధమనే చెప్పాలి.
రాష్ట్రాన్ని నాలుగుభాగాలుగా విడగ్గొట్టి నలుగురు రెడ్లకు అప్పగించిన రెడ్డి మహారాజు జగన్ రెడ్డి అయితే, బీసీ నాయకులకు కీలక మంత్రిత్వశాఖలు ఇచ్చి, రాష్ట్రనాయకత్వంలో, అభివృద్ధిలో బీసీల ముద్రకు స్థానం కల్పించిన వ్యక్తి చంద్రబా బు. బీసీ వర్గాల్లోని వెనుకుబాటుతనం పోగొట్టి, వారిని ఆర్థికంగా మరింత పైకి తీసుకురావాలనే సదుద్దేశంతోనే టీడీపీ 54 బీసీ సాధికార కమిటీలు ఏర్పాటు చేసింది ఇప్పటికీ కనీసం పంచాయతీ కార్యాలయం గడపతొక్కని వర్గాలు బీసీల్లో ఇంకా ఉన్నాయి. అలాంటి వర్గాలకు ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేసి సీనియర్ బీసీ నాయకులతో సంప్రదించి, బీసీలతో మాట్లాడాకే చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.

టీడీపీ-జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను పదవులకోసం జగన్ రెడ్డి ముందు మోకాళ్లపై కూర్చునే వైసీపీ బీసీ నాయకులు తప్పుపట్టడం సిగ్గుచేటు.ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు వైసీపీలోని కీలక బీసీ నేతలందరితో జగన్ రెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ బీసీ డిక్లరేషన్ గురించి తప్పుతప్పుగా మాట్లాడిస్తున్నారు. సజ్జల మాట్లాడుతూ…. కీలక పదవుల్ని బీసీలకే ఇచ్చామని, 70శాతం నామి నేటెడ్ పదవులు బీసీలతో నింపామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా ఇప్పుడు జగన్ రెడ్డి ఎవరిని నియమించారో, టీడీపీ ప్రభుత్వంలో ఎవరున్నారో సజ్జల చెప్పాలి. చంద్రబాబు… పుట్టాసుధాకర్ యాదవ్, కాగిత వెంకట్రావు వంటి బీసీ నాయకుల్ని టీటీడీ ఛైర్మన్లను చేస్తే, జగన్ రెడ్డి.. వై.వీ.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని ఛైర్మన్లుగా నియమించాడు.

APIICC ఛైర్మన్ గా టీడీపీ ప్రభుత్వం గతంలో కృష్ణయ్య యాదవ్ ను నియమిస్తే, జగన్ రెడ్డి… ఇప్పుడు రోజారెడ్డిని నియమించాడు. ఇలా అన్నిపదవులు రెడ్లకే కట్టబెట్టిన జగన్ రెడ్డిని సమర్థిస్తూ సజ్జల సిగ్గులేకుండా 70శాతం పదవులు బీసీలకు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. 5 ఏళ్ల పాలనలో బీసీలను దారుణం గా అణగదొక్కి, వారిని చంపి వారి శవాలపై ప్యాలెస్ లు నిర్మించుకున్న జగన్ రెడ్డి, ఆయన కుటుంబం బీసీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు.బీసీ డిక్లరేషన్ లోని అంశాలన్నీ చదివాకే సజ్జల సహా మంత్రులు… వైసీపీనేతలు నోరు విప్పాలి. పనికిరాని..చెత్త నాయకులు మాట్లాడేముందు డిక్లరేషన్ మొత్తం చదవాలి. బీసీలకోసం ఆలోచించే చంద్రబాబు, టీడీపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీనేతలకు, మంత్రులకు లేదు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలకు అనేక పథకాలు అమలుచేశారు. మొత్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వనివికూడా చంద్రబాబు అమలుచేశారు. జగన్ రెడ్డి 2019కి ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడో చెప్పండి? ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను… డీఎస్సీ నిర్వహిస్తాను అన్న ముఖ్యమంత్రి ఐదేళ్లలో ఎందరు యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చాడు? సీపీఎస్ రద్దు హామీని ఏం చేశాడు? ప్రత్యేకహోదా సాధనను ఏం చేశాడు? చంద్రబాబు గతంలో విదేశీవిద్య పథకం కింద దాదాపు 5వేల మంది యువతను ఉన్నతవిద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపితే, జగన్ రెడ్డి ఐదేళ్లలో 100 మందిని అయినా పంపాడా? చంద్రన్నబీమా పథకం తీసుకొచ్చి, ప్రమాదవశాత్తూ, అనారోగ్యాలతో మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు ఆదుకున్నారు.

ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణం అయితే రూ.2లక్షల ప్రమాద బీమా సాయం అందించారు. చనిపోయిన రోజునే మట్టిఖర్చుల కింద మృతుల కుటుంబాలకు టీడీపీప్రభుత్వం రూ.30వేలు మట్టిఖర్చుల కింద అందించింది. అలాంటి గొప్ప పథకాన్ని జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దుచేశాడు. చంద్రబాబు పేదకుటుంబాల్లో జరిగే వివాహం కూడా గొప్ప పండుగలా జరగాలనే సదుద్దేశంతో పెళ్లికానుక పథకం కింద రూ.50వేల నుంచి రూ.లక్షవరకు ఆర్థిక సాయం చేశారు. అలాంటి పెళ్లికానుక పథకాన్ని ఎందుకు రద్దుచేశారో వైసీపీనేతలు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై గొంతెత్తలేని అసమర్థ బీసీ నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం పదవులకోసం పాకులాడే వారికి బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు.

చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లోని ప్రతి అక్షరం అద్భుతమే. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీకి నెలకు రూ.4వేల పింఛన్, సంవత్సరానికి రూ.48వేల చొప్పున 5 సంవత్సరాలకు రూ.2.40 లక్షల వరకు అందించే పథకం. వయసు పైబడిన బీసీలను ఆదుకోవడం.. నెలకు వారికి రూ.4వేల పింఛన్ ఇవ్వడం వైసీపీనేతలకు ఇష్టం లేదా? జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుధ్ది ఉన్నా, బీసీలపై గౌరవమున్నా… చంద్రబాబు బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన నెలకు రూ.4వేల పింఛన్ ప్రకటనపై ఆయన హర్షం వ్యక్తం చేయాలి. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం జగన్ రెడ్డికి ఇష్టం లేదా? బాధితులు పీడితులు అయినప్పుడు.. వారికి పోలీస్ స్టేషన్లలో కూడా న్యాయం జరగనప్పుడు వారికోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం నిజంగా ప్రశంశనీయం. బీసీలపై దాడులు చేసిన వారిని.. హతమార్చిన వారిని వదిలేసి, తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి హింసించిన ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రకటించిన బీసీరక్షణ చట్టాన్ని ఆమోది స్తుందా? అసలు అలాంటి చట్టం తీసుకురావడమనే ఆలోచన జగన్ రెడ్డికి నచ్చుతుందా? ప్రత్యేక రక్షణచట్టం తీసుకురావడంతో పాటు, దాని పర్యవేక్షణకు ప్రత్యేక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటుచేస్తానన్న చంద్రబాబునాయుడికి బీసీల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

బీసీ సబ్ ప్లాన్ లో భాగంగా రాష్ట్ర జనాభాలో సగం పైన ఉన్న బీసీల అభివృద్ధికి ఏటా రూ.30వేల కోట్ల చొప్పున… 5ఏళ్లలో రూ.లక్షా50వేల కోట్లు ఖర్చు పెడతానన్న చంద్రబాబు ప్రకటనను జగన్ రెడ్డి.. వైసీపీనేతలు జీర్ణించు కోలేకపోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టిన 24 శాతం రిజర్వేషన్లను మరో 10శాతం పెంచి చంద్రబాబు 34శాతం చేస్తే, జగన్ రెడ్డి వాటిని 24శాతానికే పరిమితం చేశాడు. దాంతో బీసీలు 16,700 పదవులు కోల్పోయారు. బీసీలు ఎప్పటికీ చేతులుకట్టుకొని తమ ముందు నిలబడాలన్నదే జగన్ రెడ్డి.. అతని సామాజికవర్గ నేతల దుష్ట ఆలోచన. అందుకే బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి, వారికి దక్కాల్సిన పదవుల్ని కూడా తమ వర్గానికే ఇచ్చుకున్నారు. జగన్ రెడ్డి దుష్ట ఆలోచనలకు విరుద్ధంగా చంద్రబాబు మరలా బీసీ రిజర్వేషన్లు యథాతథంగా 34శాతం అమలుచేస్తామని చెప్పడాన్ని వైసీపీ నేతలు, మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడానికి అర్హతలేని బీసీ వర్గాల్ని కీలక స్థానాల్లో నియమిస్తామని, రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్న చంద్రబాబు నిర్ణయాన్ని కూడా మనస్ఫూ ర్తిగా స్వాగతిస్తున్నాం. కార్పొరేషన్లు.. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం బీసీలకు ప్రకటించడం చంద్రబాబు గొప్పతనం.

జనాభా దామాషా ప్రకారం బీసీవర్గాలకు నిధులుకేటాయించి, మొత్తం ఖర్చు చేస్తామని, ఏటా రూ.2వేలకోట్ల చొప్పున 5 ఏళ్లలో బీసీలకు రూ.10వేలకోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తామన్న ప్రకటనను కూడా సంతోషంగా స్వాగతిస్తున్నాం. బీసీ యువతకు అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందించి, వారికి అవసరమైన స్వయం ఉపాధి రుణాలు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి టీడీపీప్రభుత్వం పాటుపడేలా నిర్ణయం తీసుకోవడం, చేతి మరియు కులవృత్తులవారికోసం కామన్ వర్క్ షెడ్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే బీసీ యువతకు అండగా నిలిచేలా వారికి పారిశ్రామిక రాయితీలు కల్పించడం కూడా చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేని గొప్ప అంశం.

జగన్ రెడ్డిలా బీసీలను నమ్మించి వంచించేలా కాకుండా.. చంద్రబాబు బీసీ కులగణనకు సంబంధించి తీసుకున్న చట్టబద్ధమైన కులగణన నిర్ణయం బహుదా ప్రశంశనీయం. చంద్రన్న బీమా కింద బీసీ కుటుంబాలను ఆదుకునేలా ప్రమాదవశాత్తూ మరణించిన చేతి, కులవృ త్తుల వారి కుటుంబాలకు రూ.10లక్షల చంద్రన్న బీమా ప్రకటన కూడా శుభపరిణామం. బీసీలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం నిజంగా బీసీలకు వరమనే చెప్పాలి. నాయకులు.. అధికారుల చుట్టూతిరిగే పనిలేకుండా ఒకేసారి కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలనే నిర్ణయం నిజంగా స్వాగతించాల్సిందే. బీసీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగప డేలా బీసీ పాఠశాలలు.. గురుకులాలు.. జూనియర్ కళాశాలల్ని అప్ గ్రేడ్ చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎలాంటి షరతులు లేకుండా విదేశీవిద్య పథకం బీసీ యువతకు అమలు చేయడం..స్టడీ సర్కిళ్ల పునరుద్ధరణ..ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్, గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వాలనే నిర్ణయం బీసీ యువతకు గొప్పవరమనే చెప్పాలి.

టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన బీసీ భవనాల్ని జగన్ సర్కార్ నిరుపయోగంగా మార్చింది. వాటిని ఇతర కార్యకలాపాలకు కేటాయించింది. గ్రామస్థాయి నుంచి బీసీ భవనాలు నిర్మించడమే గాక, రాజధానిలో భారీస్థాయిలో బీసీ భవన్ నిర్మిస్తామన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఉమ్మడి నిర్ణయం నిజంగా చాలా గొప్పది చంద్రబాబు నాయుడు గతంలో చాలా బీసీ కులాలకు బ్యాంక్ గ్యారెంటీ లతో సంబంధం లేకుండానే బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించారు. ఆ పథకాన్ని మరలా కొనసాగించడం… మరిన్ని బీసీ కులాలను రుణం పొందే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం.

బీసీలను నిర్వీర్యం చేయాలన్న జగన్ రెడ్డి ఆలోచనల్ని సమర్థించేవారే డిక్లరేషన్ ను తప్పుపడతారు. ప్రతి బీసీ సోదరుడు టీడీపీ-జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను పూర్తిగా చదివి, వాస్తవాలు గ్రహించాలి. బీసీల భవిష్యత్ బాగుండాలి.. వారికి నిజంగా న్యాయంచేయాలి.. వారు సంతోషంగా ఉండాలను కునే బీసీ నాయకులు ఎవరూ జగన్ రెడ్డితో ఉండరు. కొలుసు పార్థసారథి..గుమ్మనూరు జయరామ్ లు జగన్ రెడ్డి బీసీలకు చేసిన ద్రోహాన్ని భరించలేకే టీడీపీ గూటికిచేరారు. దగాపడ్డ బీసీ బిడ్డలమని ఇప్పటికే బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రిపై తన ఆవేదనను వెళ్లగక్కాడు. సొంత బాబాయ్ ను చంపించి, తల్లి..చెల్లిని తరిమేసిన వ్యక్తి, స్వార్థరాజకీయాల కోసం దేనికైనా తెగించే వ్యక్తికి బీసీలు మద్ధతు తెలిపితే, తమజాతికి తాము ద్రోహం చేసుకున్నట్టే. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను గ్రామగ్రామానికి తీసుకెళ్లి, ప్రతి బీసీకి వాస్తవాలు తెలియచేస్తాం“”” అని రవీంద్ర స్పష్టం చేశారు.