Phone Tapping Case: బిగ్ ట్విస్ట్.. TDP నేతకు ఫోన్ ట్యాపింగ్ లింక్‌లు
Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌తో పాటు ఇతర నేతలు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి వారిని బెదిరించి ఫండ్స్ సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఇద్దరు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో పాటు మరో ఇద్దరు కీలక అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
అయితే.. ఈ కేసుకు సంబంధించి కీలక అంశం ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లింక్‌లను ఓ తెలుగు దేశం పార్టీ నేతకు ఇచ్చినట్లు సమాచారం. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన శివానంద రెడ్డి అనే రిటైర్డ్ అధికారి తెలుగు దేశం పార్టీ నేతకు లింకులను ఇచ్చినట్లు తెలుస్తోంది. అతనికి హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. లిఖితపూర్వకంగా నోటీసులు ఇవ్వాలని కోరారు. నోటీసులు ఇచ్చే లోపే శివానంద రెడ్డి వెళ్లిపోయాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు శివానంద రెడ్డి నమ్మకస్తుడిగా ఉన్నాడు.