Anam: నువ్వు పేదోడివని తెలీక లోకేష్ అలా అన్నాడు జగన్.. క్షమించు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (jagan) పంచ్‌లు వేసారు TDP నేత ఆనం వెంకటరమణ రెడ్డి (anam). జగన్ తన అఫిడవిట్‌లో అసలు ఒక్క ఇల్లు కానీ కారు కానీ లేని పేదవాడు అని పేర్కొన్నాడని.. ఆ విషయం తెలీక తమ నేత నారా లోకేష్ (nara lokesh) జగన్ ఆస్తులు బయటపెట్టమంటున్నారని పంచ్‌లు వేసారు. అందుకు తమను క్షమించాలని జగన్‌ను కోరారు. ఇంత నిరుపేద వ్యక్తికి ఓ ఫ్రెంచ్ కంపెనీ 2 కోట్లకు పైగా షేర్స్ ఎలా ఉన్నాయని అడిగారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి సిమెంట్ కొనుగోలు చేయాలన్నా భారతి సిమెంట్స్ నుంచే కొనుగోలు చేయాలని వేరే వారి నుంచి కొనుగోలు చేసేందుకు వారు ఒప్పుకోరని అన్నారు. ఈ దేశంలో అసలు అప్పు లేని సంస్థ భారతి సిమెంట్సేనని అన్నారు. మరి ఇంత విలువ చేసే ప్రాపర్టీలు ఉన్న జగన్ తన వద్ద ఏమీ లేవని అఫిడవిట్లో ఎలా పేర్కొన్నారని ప్రశ్నించారు.