Alliance: TDP – జనసేన – BJP పొత్తు ఖాయం

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నిక‌ల్లో పోటీప‌డుతున్న పార్టీలు జ‌న‌సేన‌, BJP, TDP. అధికార YSRCP ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డానికి ఈ మూడు పార్టీలు పొత్తు (alliance) పెట్టుకోబోతున్నాయ‌ని ఎప్ప‌టినుంచో టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్ (janasena pawan kalyan) భేటీ కూడా అయ్యారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు.. దిల్లీ వెళ్లి కేంద్ర‌మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌ను కూడా క‌లిసారు. కానీ పొత్తు పెట్టుకుంటున్నాం అని మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది లేదు. దీనిపై తాజాగా స్పందించారు ఏపీ BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి (adinarayana reddy). ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు. ఏపీ రాష్ట్ర భ‌విష్య‌త్తు కోస‌మే పొత్తుల నిర్ణ‌యం తీసుకున్నామ‌ని పేర్కొన్నారు.