TDP Janasena Alliance: మహానాడు వేదికపై ప్రకటించనున్నారా?

AP: YCPని ఎలాగైనా అధికారంలో నుంచి దించేయాలని TDP, జనసేన (janasena) పార్టీలు భావిస్తున్నాయి (tdp janasena alliance). ఇక పలుమార్లు చంద్రబాబు, పవన్‌ భేటీ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. పవన్‌ వచ్చే ఎన్నికల్లో పొత్తులతో వెళ్తామని ప్రకటించారు. పరోక్షంగా టీడీపీ, బీజేపీతో పొత్తు ఉండవచ్చని అన్నారు. అయితే.. చంద్రబాబు, బీజేపీ నాయకుల నుంచి మాత్రం పొత్తుల గురించి అధికార ప్రకటన రాలేదు. అయితే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో చేపట్టిన మహానాడులో చంద్రబాబు పొత్తులపై ఏదో ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అలా చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో కూడా టీడీపీ-జనసేన మధ్య ఓ అవగాహన ఏర్పడుతుందని TDP నాయకులు భావిస్తున్నారు. పొత్తుల అంశంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరోక్షంగా సంకేతం ఇచ్చారు. మహానాడులో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతో చంద్రబాబు పొత్తుల గురించి ఏం మాట్లాడతారు అన్నది ఉత్కంఠగా మారింది.

2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన తొలిసారిగా పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ పొత్తుపై ప్రకటన రావడం, ప్రధానిగా ప్రచారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ఏపీకి వచ్చి చంద్రబాబు, పవన్ లతో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొనడంతో ఓ హైప్ ఏర్పడింది. దీంతో టీడీపీ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీలు అధికారంలోకి వచ్చాయి. మరి ఈ సారి బీజేపీ కలుస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. కానీ టీడీపీ జనసేన మాత్రం కలిసి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. రాష్ట్రంలో YCP బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికలకు ఉమ్మడిగా ప్రచారం చేసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.