TDP Janasena: రేపే తొలి అభ్యర్ధుల లిస్ట్..!?
TDP Janasena: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) పొత్తుతో బరిలోకి దిగనున్న తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీల మధ్య సీట్ షేరింగ్ ప్రక్రియ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలకు సంబంధించిన తొలి అభ్యర్ధుల జాబితాను రేపే ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రేపు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పలు మార్లు సీట్ల షేరింగ్‌పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమావేశమయ్యారు. అభ్యర్ధుల ఎంపిక కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మెజారిటీ స్థానాల్లోని అభ్యర్ధులను రేపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. (TDP Janasena)
కొద్ది సేపటి క్రితమే చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అమరావతి నుంచి అమరావతి చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అమరావతి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తెలుగు దేశం పార్టీ మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇరు పార్టీ నేతల నుంచి సమాచారం. రేపు మంచి రోజు కావడంతో కచ్చితంగా లిస్ట్ అనౌన్స్ చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: AP Elections: TDP వ్యూహం అదుర్స్..!
గత కొంతకాలంగా ఈ సీట్ల షేరింగ్‌కు సంబంధించి తెలుగు దేశం పార్టీ ఎన్ని స్థానాల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై అనేక దఫాలుగా ఉండవల్లి, హైదరాబాద్‌లలోని చంద్రబాబు నాయుడు నివాసాల్లో సమావేశాలు జరిగాయి. సీట్ల షేరింగ్‌కు సంబంధించి ఇరు పార్టీల అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. భారతీయ జనతా పార్టీకి (BJP) సంబంధించి కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఇన్‌ఛార్జిలుగా పనిచేస్తున్నారో వారికి టికెట్లు కన్ఫామ్ అని ఇప్పటికే రివ్యూల ద్వారా తెలియజేస్తున్నారట. దీనికి సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి అని తెలుగుదేశం, జనసేనకు కొంత క్లారిటీ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి ఎవరు వస్తారో తెలిసిపోతుంది. సీట్లకు సంబంధించి కూడా రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఏడు, ఎనిమిది జాబితాలను అనౌన్స్ చేసేసారు. కానీ తెలుగు దేశం, జనసేన మాత్రం కసరత్తులు చేసాయి.
గతంలో తెలుగు దేశం పార్టీ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ తాము పోటీ చేయబోయే నియోజకవర్గం పేరు బయటికి చెప్పేయడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటించడంతో కాస్త విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలను చూసి YSRCP తనకు బెనిఫిట్ అయ్యేలా మార్చుకోవాలని చూసింది. తెలుగు దేశం, జనసేన పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టాలని నేతలు ఎంతో ప్రయత్నించారు. అయినా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అవేమీ పట్టించుకోలేదు. ముందు ముందు ఇలాంటి విభేదాలు ఏర్పడకుండా ఉండటానికే అభ్యర్ధుల ప్రకటనలో కాస్త ఆలస్యం జరిగినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.
ALSO READ: YS Sharmila: ఓ చెల్లిగా అర్థం చేసుకున్నా.. పొత్తుకు సై ..!
ALSO READ: Pawan Kalyan: పరిణితి చెందారు.. పవర్ మంత్రం పట్టేసారు