TDP: గణపతి కమ్మ కులానికి చెందినవాడు.. యాదవ కులస్తురాలిని పెళ్లాడాడు
గణణాథుడు కమ్మ కులానికి చెందినవాడని.. ఆయన యాదవ కులస్తురాలిని పెళ్లి చేసుకున్నాడని వింత వ్యాఖ్యలు చేసారు తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ ప్రసూన. తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మార్పు తగదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పు పట్టారు.
“” గణపతి దేవుడు కమ్మ వ్యక్తి. యాదవ కులస్తూరాలిని పెళ్ళాడి రెండు కులాల మధ్య బంధం పెంచారు. సీతక్క గారు మీరు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కడిగిన ముత్యం. రేవంత్ రెడ్డి గారు… మీరు చిత్రకారులు అనుకున్న కానీ చరిత్రను వక్రీకరించి చాతుర్యం ఉన్న నాయకులు అనుకోలేదు. మీరంటే గౌరవం ఉండేది. చరిత్రను మార్చి రాబోయే తరాలకి విషం నింపబోతున్నారని అనుకోలేదు. కాకతీయులు ఢిల్లీ రాజులను ఎదిరించి భారతదేశంలో రాజకీయ చరిత్రను మార్చేసిన గొప్ప వ్యక్తులు.
గొప్ప చరిత్రను, శిల్ప కళా కలిగిన వ్యక్తులు కాకతీయులు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి, పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కాకతీయ కళా తోరణంను తీసివేయడంలో మీ పాత్ర ఉందని అర్థం అవుతోంది. సమ్మక్క, సారక్కలను చంపింది కాకతీయులు అని ములుగు సామ్రాజ్యం గురించి మాట్లాడేలాగా చేస్తున్నారు. కమ్మ వారు లేకపోతే ములుగు ఉందా? మీరు ములుగులో నిలబడండి నేను నిలబడుతా. ఇలాంటి చర్యలు తగవు సీతక్క “” అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు.