Amarnath Reddy: మా వాళ్లు కూడా తాగారని వదిలేయొచ్చుగా..!
ఇటీవల పుంగనూరులో TDP కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని సైకిల్ యాత్ర చేస్తుంటే.. YSRCP మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddi ramachandra reddy) అనుచరుడు సూరి (suri) వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వారిని నోటికొచ్చినట్లు దూషిస్తూ నడిరోడ్డుపై బట్టలు విప్పించి పెద్దిరెడ్డి అన్న అడ్డా రా అంటూ వీధి రౌడీలా బిహేవ్ చేసాడు. దీనిపై TDP నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పుంగనూరు ఎస్పీ.. సూరి తాగి ఉన్నాడని అందుకే అలా ప్రవర్తించాడని కేసు నమోదు చేయకుండా వదిలేసారట. దీనిపై TDP మాజీ మంత్రి అమర్నాథ్ (amarnath reddy) రెడ్డి స్పందించారు.
గతంలో చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పుంగనూరులో (punganur) ప్రచారం చేస్తున్న సమయంలో అంగళ్ల (angallu) వీధి నుంచి వెళ్తుండగా తమపై కేసులు పెట్టారని.. మరి ఆ సమయంలో తమని కూడా తాగున్నారని ఎందుకు వదిలేయలేదని ప్రశ్నించారు. ఎస్పీ అధికార ప్రభుత్వానికి కొమ్ములు కాస్తున్నాడని.. ఇప్పటివరకు TDP, YSRCPలపై ఎన్ని కేసులు పెట్టారో వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రజల సొమ్మును జీతంగా అందుకుంటున్నప్పుడు కనీసం ప్రజల కోసం గంటైనా నిజాయతీగా పనిచేయాలని అన్నారు. (tdp ex minister amarnath reddy)