TDP: జగన్‌కు డిపాజిట్లు కూడా రాకూడదు
TDP: జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) పులివెందులలో కనీసం డిపాజిట్ కూడా రాకూడదని అన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). APSCCలో జరిగిన అక్రమాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన జగన్ గురించి ప్రస్తావించారు. బాబాయిని గొడ్డలితో నరికి పిన్ని తాళిబొట్టు తెంచేసిన వ్యక్తికి ఎవరు ఓటేస్తారని ప్రశ్నించారు. అతనికి ఒక్క ఓటు కాదు కదా కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఈరోజు ఆడదానికి రాష్ట్రంలో రక్షణ లేదని.. ధైర్యంగా బయటికి వెళ్తే తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేదని.. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం, భూకబ్జాలు తప్ప ఇంకేమీ కనిపించడంలేదని ఆరోపించారు. ఇంత చెప్పిన తర్వాత కూడా జగన్‌కు ఓటేస్తే అది రాష్ట్రానికి పట్టిన ఖర్మ అవుతుందని వ్యాఖ్యానించారు.