TDP BJP Janasena: పొత్తు ఖ‌రారు.. ఎవ‌రికి ఎన్ని సీట్లంటే..!?

TDP BJP Janasena: తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసేందుకు NDA ఆల్మోస్ట్ ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. దీని గురించి చ‌ర్చించేందుకే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. (Pawan Kalyan) నిన్న మంగ‌ళ‌గిరిలోని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ఇంటికి వెళ్లారు. మ‌రోప‌క్క పొత్తు గురించి చ‌ర్చించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి (Purandeswari) ఢిల్లీ బ‌య‌లుదేరారు.

ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party) హైక‌మాండ్‌ను క‌లిసి చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు. రేపు ఢిల్లీకి చంద్ర‌బాబు నాయుడు వెళ్ల‌నున్నారు. ఆల్రెడీ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు పొత్తులో ఉండ‌గా.. మొద‌టి జాబితాను ప్ర‌క‌టించేసిన నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌ల‌ను ఒకేసారి పిలిచి మాట్లాడాల్సిందిపోయి వేర్వేరుగా రావాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ ఆదేశించింది. పొత్తులో భాగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి 5 ఎంపీ సీట్లు, 9 ఎమ్మెల్యే సీట్లు ద‌క్క‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. (TDP BJP Janasena)

BJP ముందుగా మాట్లాడుకోవ‌డంలో వారి స్ట్రాటెజీ వారికి ఉంటుంది. పురంధేశ్వ‌రి పొత్తు గురించి ముందు మాట్లాడ‌క‌పోవ‌డం కూడా ఒక ప్లానే. ఒక పొత్తుకు సంబంధించి రాష్ట్ర అధ్య‌క్షురాలిగా రెండు రోజుల పాటు ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ అన్ని ప్రాంతాల‌కు సంబంధించిన నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఎవ‌రు ఎక్క‌డి నుంచి పోటీ చేయాలి, ఎవ‌రు ఏ స్థానాల నుంచి ఆస‌క్తిక‌రంగా ఉన్నారు వంటి అంశాల‌ను శివ ప్ర‌కాశ్ కూడా చ‌ర్చించారు. చ‌ర్చ‌ల్లో భిన్న అభిప్రాయాలు వ‌చ్చాయి. కొంద‌రు పొత్తు ఉండాల‌ని ఇంకొంద‌రు పొత్తు వ‌ద్ద‌ని అన్నారు. మరి కొంద‌మందైతే చంద్ర‌బాబు పొత్తు ధ‌ర్మం పాటించ‌డంలేద‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

BJP ఒక్క‌టే చెప్తోంది.. ప‌వ‌న్ ఇప్ప‌టికీ పొత్తులోనే ఉన్నారు అని. కానీ ఏ రోజూ కూడా ప‌వ‌న్ నేను భార‌తీయ జ‌న‌తా పార్టీలో లేను అని కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ప‌వ‌న్ మాతో లేడు అని చెప్ప‌లేదు. దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ముందుగా పిలిచారు. కాక‌పోతే ప‌వ‌న్ ప్రోగ్రామ్ ఇంకా డిసైడ్ కాలేద‌ట‌. ఈరోజు రాత్రి ఢిల్లీ వెళ్తారా? లేక రేపు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. చంద్ర‌బాబు రేపు మ‌ధ్యాహ్నం ఢిల్లీకి ర‌మ్మ‌న‌డానికి కూడా కార‌ణం అదే. ఇప్పుడు ఎంత వ‌ర‌కు వారు అడిగిన స్థానాల‌ను ఇవ్వ‌గ‌ల‌రు? ఇస్తే ఈ స్థానాల‌కు సంబంధించి ఏ అంశాలున్నాయ్‌? అంత‌ర్గ‌తంగా ఏద‌న్నా స‌మ‌స్య వ‌స్తుందా?

ఆల్రెడీ సీట్ల‌ను డిసైడ్ చేసేసాం కాబ‌ట్టి.. ఎలాంటి ఇబ్బంది లేదు అనే క్లారిటీ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న BJP ప‌వ‌ర్‌ఫుల్. ఇక ఏపీలో తెలుగు దేశంతో క‌లిసి పొత్తులో భాగంగా పోటీ చేయాల‌నుకున్న‌ప్పుడు రేపు ఆ సీట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు దేశం కానీ జ‌న‌సేన కానీ ఆ సీటు నాది అని గొడ‌వ‌పడితే బాగోదు. భార‌తీయ జ‌న‌తా పార్టీ కోరుకుంటోంది కూడా ఇదే. మా సీటుని మీరు క్లారిటీగా ఉంచారా లేదా? అనే అంశాల‌పైనే చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే పొత్తు గురించి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు మౌనంగా ఉన్న‌ట్లు టాక్.