AP Elections: గెలుపు కూటమిదే.. తేల్చేసిన సర్వేలు
AP Elections: త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే అంశంపై ఇప్పటినుంచే సర్వత్రా ఉత్కంఠ ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈసారి కలిసి బరిలోకి దిగనున్నాయి. మరోపక్క లోక్ సభ ఎన్నికలు కూడా ఇప్పుడే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే పోల్స్ బయటికి వచ్చాయి.
ABP-C ఓటర్ సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో NDAకు 20 లోక్ సభ స్థానాలు దక్కేలా ఉన్నట్లు పేర్కొంది. అధికార YSRCPకి మాత్రం 5 స్థానాలే వచ్చేలా ఉన్నాయని పేర్కొంది. ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 4, కాంగ్రెస్కు 10, భారత రాష్ట్ర సమితికి 2, ఎంఐఎంకి 1 వచ్చేలా ఉన్నట్లు వెల్లడించింది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో NDA ప్రభంజనం సృష్టించనుందని సర్వే తేల్చేసింది. ఇక ప్రముఖ ఆంగ్ల ఛానెల్ అయిన న్యూస్ 18 చేపట్టిన పోల్ సర్వేలో ఏపీలో ఎన్డీయేకి 18 లోక్ సభ స్థానాలు రానున్నాయని వెల్లడించింది.