TDP: తొలి జాబితా.. YSRCPలో భయం మొదలు
TDP: జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రాష్ట్రం నుంచి జగన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు తెలుగు దేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి తొలి జాబితా చూసి వైకాపా నాయకుల భయపడుతున్నారని అన్నారు. ఓడిపోతున్నామనే భయంతో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య జగన్ రెడ్డి చిచ్చు పెడుతున్నాడని ఆయన ఆరోపించారు. సోమవారం మంగళగిరిలోని TDP జాతీయ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు.
తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితా చూసి తొలి జాబితా చూసి అన్ని వర్గాల వారు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాడేపల్లి కొంప మాత్రం కంపించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి భయం మొదలైంది. జగన్ మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరింది. తెలుగుదేశం-జనసేన పోత్తు అనేది 5 కోట్ల ఆంధ్రలు ఆకాంక్ష. రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. 175కి 175 గెలుస్తున్నామని బల్లగుద్ది చెప్పావు కదా జగన్ రెడ్డి!.. మా జీబితా చూసి ఎందుకు వణుకుతున్నావు? కులాలను రెచ్చగొట్టి కుంపటలు రగిలిస్తున్నావు. రాష్ట్ర భవిష్యత్తుకై తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం పాటిస్తున్నారు. కానీ అంబటి, పేర్ని వంటి వైకాపా కాపు నేతలు మాత్రం పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని చూసి వైకాపా నాయకులు భయపడుతున్నారు. కాపులకు 5% రిజర్వేషన్‌ను రద్దు చేస్తే ఒక్క వైకాపా నాయకుడు కూడా నోరు మెదపలేదు. కాపు కార్పొరేషన్‌ను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సినీ ఇండస్ట్రీలో అగ్ర నటుడు చిరంజీవి గారు తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తే జగన్ రెడ్డి ఆయనకు ఇచ్చిన గౌరవం ఏంటి? ఆనాడు ఒక్క కాపు నాయకుడైనా ఎందుకు మాట్లాడలేదు? కానీ నేడు పవన్ కళ్యాణ్‌పై సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు బిడ్డలను విద్య కోసం విదేశాలకు పంపడం, పెళ్ళి కానుకలు ఇవ్వడం, చిన్న వ్యాపారులకు లక్ష రూపాయిల రుణాలు అందించాము. (TDP)
ALSO READ: Dharmana Vs Subba Reddy: ఎవడ్రా నువ్వు .. ** మీద తంతా
మాది విన్నింగ్ టీమ్ – వైసీపీది కన్నింగ్ టీమ్. అందుకే జగన్ రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మా కూటమి దెబ్బకు అభ్యర్ధులను మారుస్తున్నాడు. జగన్ రెడ్డి ఎంతమందిని మార్చినా ప్రజలు మాత్రం జగన్ రెడ్డినే మార్చాలనుకుంటున్నారు. జగన్ రెడ్డి మైనింగ్, స్యాండ్, ల్యాండ్, వైన్‌లో చేసిన దోపిడీ చూసి, పన్నులను చూసి ప్రజలు భయపడుతున్నారు. రాజధానిని చంపేసి, పోలవరాన్ని ముంచేయడంతో జగన్ రెడ్డిపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. 120 సంక్షేమ పథకాలను రద్దు చేసి కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించి జగన్ రెడ్డి లూటి చేశాడు. రాష్ట్రాన్ని ఐదు ప్రాంతాలుగా విభజించి ఐదుగురు రెడ్డి రాజులను పెట్టి పరిపాలించాడు. నామినేటెడ్ పదవులు, సలహాదారులను, ఆఖరికి యూనివర్శిటీ ఛాన్సలర్లను ఒకే సామాజిక వర్గానికి కేటాయించారు.
రాయలసీమలోని 74 సీట్లో బలిజలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజంపేటలో లోక్ సభ సీటు బలిజలకు ఇచ్చే సాంప్రదాయానికి గొడ్డలివేటు వేసి మిథున్ రెడ్డికి ఇస్తే..అంబటి, పేర్ని, అమర్నాథ్లు ఎందుకు నోరు మెదపలేదు? కేవలం రాష్ట్రాన్ని మొత్తం జగన్ రెడ్డి తాబేదారులను పెట్టి పరిపాలన చేస్తున్నారుడు. పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించ లేదని వైకాపా నాయకులు ఏడుస్తున్నారు. అసలు ఇంతవరకు జగన్ రెడ్డి నుంచునే సీటునే ప్రకటించలేదు. వైకాపాకు అభ్యర్ధులు దొరకడం లేదు. కరకట్ట కమలహాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని బ్రతిమిలాడి, కాలు పట్టుకొని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అధికారంలోకి వచ్చని జగన్ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు నిరాకరిస్తున్నాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఐదు సంవత్సరాలు శ్రీనును జైలులో పెట్టావు. రాష్ట్రంలో శాంతి భ్రదతలే లేకుండా పోయాయి. వీటిపై చర్చకు నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి? ఎన్ని ఎత్తులు వేసిన పులివెందులలో కూడా జగన్ రెడ్డి గెలవలేడు. రాబోయే ఎన్నకల్లో 150 సీట్లతో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నా అని ఆయన తెలియజేశారు.