నారా చంద్ర‌బాబు నాయుడు అనే నేను.. ముహూర్తం ఫిక్స్!

tdp alliance won in ap elections

Chandrababu Naidu:  ఊహించిన‌ట్లుగానే.. తెలుగు దేశం పార్టీ కూట‌మి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చేసింది. ఇక నుంచి మీ రాజ‌ధాని ఏంటి అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను అడిగితే.. అమ‌రావ‌తిని అని ధైర్యంగా గ‌ర్వంగా చెప్పుకోగ‌లుగుతారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైజాగ్‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించాల‌ని అనుకున్నారు.

అలా ఐదేళ్లుగా హైద‌రాబాదే రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొనసాగింది. మొన్నటితో ఏపీకి రాజ‌ధానే లేకుండాపోయింది. ఇక ఆ చింత లేదు. తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల కూట‌మి అధికారంలోకి వ‌చ్చేసింది. ఇక జూన్ 9న చంద్ర‌బాబు నాయుడు అనే నేను.. అని తెలుగు దేశం పార్టీ అధినేత ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. ఉద‌యం 11:53 గంట‌ల‌కు ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అమ‌రావ‌తిలో జ‌ర‌గ‌బోతోంది.