2024 Elections: విపక్షాలు ఏకమవుతున్న వేళ.. ఆందోళనలో బీజేపీ!

Delhi: దేశంలో విపక్ష పార్టీలు(opposition partys) అన్నీ రానున్న ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్తాయా లేదా అన్న సందిగ్ధం నిన్న మొన్నటి వరకు నెలకొంది. ఈక్రమంలో బీజేపీ(bjp)కి వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు సంఘటితమవ్వాలని కాంగ్రెస్‌(congress), జనతాదళ్‌ యునైటెడ్‌(janathadal united), రాష్ట్రీయ జనతాదళ్‌(rastriya janathadal) అగ్రనేతలు సమాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే(kharge), ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌(rahul gandhi), జేడీయూ నేత, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌(nithish kumar), ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌(tejaswi yadhav) ఢిల్లీ(delhi)లో సుదీర్ఘ మంతనాలు జరిపారు. డీఎంకే(dmk), ఎన్సీపీ(ncp)తో కాంగ్రెస్‌ నేతలు చర్చించాలని.. టీఎంసీ(tmc), ఆప్‌(Aap), బీఆర్‌ఎస్‌(brs) తదితర పార్టీల అధినేతలతో నితీశ్‌ కుమార్‌ చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ముందు ఖర్గే డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్‌(stalin), శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే(uddhav thackeray)తో చర్చించారు. ఈ సమావేశం తర్వాత రాహుల్‌, ఖర్గే మీడియాతో మాట్లాడారు. విపక్షాలను ఐక్యం చేసేందుకే తాము అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలను సంఘటితం చేసి కలిసికట్టుగా పనిచేయాలన్నదే తమ ప్రయత్నమని నితీశ్‌ కుమార్‌ అన్నారు.

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) బిహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కలిశారు. ఢిల్లీలో జరిగిన వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ తో నితీష్, తేజస్వీ చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత కేజ్రీవాల్ భేటీ జరిగింది. ఈ పరిణామంతో బీజేపీ అగ్రనాయకత్వం కొంత ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్‌, దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఎవరికి వారే అన్నట్లు ఉండగా.. ప్రస్తుతం సీఎం నితీష్‌ కుమార్‌ చొరవతో మరోసారి విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేలా కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీకి రానున్న ఎన్నికలు గట్టి సవాలుగా మారనున్నాయి.