Tammineni Veerabhadram: తమ్మినేనికి గుండెపోటు
Tammineni Veerabhadram: CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులతో చెప్పారట. స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆయనకు వచ్చింది గుండెపోటు కాదని.. గ్యాస్ట్రిక్ సమస్య అని సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.