Stalin: మోదీ.. ఇంకోసారి తమిళ్ అంటే బాగోదు
Chennai: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. (stalin) ప్రధాని నరేంద్ర మోదీకి (narendra modi) వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి తమిళ్ (tamil) అంటే బాగోదని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మాన డిబేట్‌లో (no confidence motion) మోదీ DMK పార్టీ గురించి పదే పదే తప్పుగా ప్రస్తావించారని స్టాలిన్ మండిపడ్డారు. అంతేకాకుండా నిన్న న్యాయ వ్యవస్థలో మార్పులు చేస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) పలు చట్టాలకు హిందీ పేర్లు పెట్టారు. వాటిపై కూడా స్టాలిన్ (stalin) మండిపడ్డారు. మరోసారి హిందీ భాషను (hindi) రుద్దాలని చూస్తున్నారని, దీనిని ఎదర్కోవడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు.