MK Stalin: ఇండియా గెలిచి తీరాల్సిందే
రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) ఇండియా కూటమి (india bloc) గెలిచి తీరాల్సిందేనని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin). లేకపోతే ఇండియా మొత్తం మరో మణిపూర్, హర్యానాలా మారిపోతుందని అన్నారు. ఎన్నికలకు ముందు BJP చేసిన ఏ హామీని నిలబెట్టుకోలేదని స్టాలిన్ పాడ్‌కాస్ట్ ద్వారా వెల్లడించారు. అందరి ఖాతాల్లోకి రూ.15 లక్షలు వేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామని BJP హామీలు ఇచ్చిందని వాటిని ఇంత వరకు నెరవేర్చలేదని అన్నారు. పబ్లిక్ సెక్టార్ అభివృద్ధికి సంబంధించి ఎవరినైనా ప్రశ్నిస్తే వాటిని కవర్ చేసుకునేందుకు అల్లర్లు సృష్టిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవడం ఎంతో ముఖ్యమని ప్రజలను హెచ్చరించారు. (mk stalin)
దీనిపై BJP తమిళనాడు అధ్యక్షుడు నారాయణ్ తిరుపతి స్పందిస్తూ.. BJP ఎప్పుడూ కూడా రూ.15 లక్షలను ప్రతి ఖాతాలో వేస్తామని హామీల్లో చెప్పలేదని.. స్టాలిన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తమిళనాడు ఇండియాలో భాగం కాదు అని వేరు చేసి మాట్లాడే స్టాలిన్ మొదటిసారి ఇండియా అనేది ఒక దేశం అని గుర్తించినందుకు సంతోషంగా ఉందని ఎద్దేవాచేసారు.