Talasani Srinivas Yadav: ఇంకోసారి నోటికొచ్చినట్లు వాగావో…
Hyderabad: బీసీ నేతల మీద బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తున్న TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి (revanth reddy) నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav), ఇతర బీసీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రెస్ మీట్లు పెట్టి తమ గురించి కానీ తమ పార్టీ గురించి కానీ వల్గర్గా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కుంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులవృత్తులను ప్రమోట్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ తమకు క్షమాపణలు చెప్పాలని ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీ సంఘాల అధినేతలు అందరూ ఈ ధర్నాలో పాల్గొంటారని అన్నారు.