Talasani: KCRని సీఎం చేయాలంటే మోదీని ఎందుకు క‌ల‌వాలి?

KTRని సీఎం చేయడానికి ప్రధానిని ఎందుకు కల‌వాలి అని ప్ర‌శ్నించారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ (talasani). నిన్న నిజామాబాద్‌లోని ఇందూరులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని నరేంద్ర మోదీ (narendra modi) సీఎం KCRపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత KCR త‌న‌ను క‌ల‌వ‌డానికి ఢిల్లీ వ‌చ్చార‌ని.. KTRను తెలంగాణ సీఎం చేసి త‌మ పార్టీని NDAలో చేర్చుకోవాల‌ని రిక్వెస్ట్ చేసార‌ని తెలిపారు. కానీ ఇందుకు తాను ఏమాత్రం ఒప్పుకోలేద‌ని అన్నారు.

దీనిపై త‌ల‌సాని స్పందిస్తూ.. “” KTRని సీఎంని చేయ‌డానికి ప్ర‌ధానిని ఎందుకు క‌ల‌వాలి? మా పార్టీ నిర్ణయం, మా ఎమ్మెల్యేలు నిర్ణయంతో ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. దీనికి ప్రధాని అనుమతి ఎందుకు “” అని ప్ర‌శ్నించారు. మోదీ వ్యాఖ్య‌ల‌పై KTR కూడా స్పందించారు. NDA లాంటి మునిగిపోయే ప‌డ‌వ‌లో చేర‌డానికి త‌మ‌కేమైనా పిచ్చి కుక్క క‌రిచిందా అని మండిప‌డ్డారు. లో ఉన్న చాలా పార్టీలు బ‌య‌టికి వ‌చ్చేసాయ‌ని తెలిపారు.