Taiwan: తైవాన్ మీదా? దమ్ముంటే రష్యా నుంచి భూమి లాక్కో
Taiwan: తైవాన్ తమ భూభాగానికి చెందినదే అని చైనా చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టీ. తైవాన్ ఎంతో కాలంగా స్వీయ పరిపాలిత ప్రజాస్వామ్య దేశంగా ఉంది. కానీ చైనా మాత్రం తైవాన్ అనేది వేరే దేశం కాదని.. తమ భూభాగంలోనిదే అని ఆరోపిస్తోంది. దీనిపై లై చింగ్ స్పందిస్తూ.. చైనా భూమి రష్యా దగ్గర ఉన్నప్పుడు ఆ భూమిని ఎందుకు లాక్కునేందుకు ధైర్యం చేయలేకపోయారు అని ప్రశ్నించారు. ఒకప్పుడు 1808లో ట్రీటీ ఆఫ్ ఐగున్ ప్రకారం చైనా 10 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని రష్యా వల్ల కోల్పోయింది. ఆ ప్రాంతం పేరే వ్లాడివోస్టోక్. ఇప్పుడు ఈ ప్రాంతం రష్యాలో భాగంగా ఉంది.
మరి రష్యాలో ఉన్న ప్రాంతాన్ని ఎందుకు చైనా వెనక్కి లాక్కోలేకపోలేకపోయారు అని తైవాన్ చైనాను ప్రశ్నించింది. ఇప్పుడు చైనా బాధంతా తైవాన్‌ను తమ భూభాగంలో కలుపుకోవాలని కాదని.. ప్రపంచవ్యాప్తంగా తైవాన్ కంటే చైనా శక్తిమంతమైనదని చాటి చెప్పేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రయత్నిస్తున్నారని లై చింగ్ ఆరోపించారు. వ్లాడివోస్టాక్ ప్రాంతం రష్యా భూభాగంలో ఉండిపోవడంతో చైనాకు చారిత్రాత్మకంగా ఎంతో నష్టం వాటిల్లింది. అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని తమ భూభాగంలోకి తెచ్చుకునేందుకు చైనా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ తైవాన్ చిన్న దేశం కావడంతో ఆ ప్రాంతంపై పడి జిన్ పింగ్ ఏడుస్తున్నాడట.
ఉక్రెయిన్‌లోని కొంత భూభాగం రష్యాదని.. దానిని తమకు అప్పగించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించాడు. రష్యా ఈ టాపిక్ తేవడంతో ఇటీవల చైనా కూడా తమ ప్రాంతమైన వ్లాడివోస్టోక్‌ను తమకు అప్పగించాలని కోరింది. కానీ రష్యా చైనా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదు. ఏం చేయలేని స్థితిలో ఉన్న చైనా వ్లాడివోస్టోక్‌లో జరిగే రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తోంది.