Syamala: YSRCP అధికార ప్ర‌తినిధిగా శ్యామ‌ల‌

Syamala is the official spokesperson of ysrcp

Syamala: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాంక‌ర్ శ్యామ‌ల‌ను అధికార ప్ర‌తినిధిగా నియ‌మించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో శ్యామ‌ల వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారంలో పాల్గొంది. చంద్ర‌బాబు నాయుడు ముస‌లి తోడేలు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుంట న‌క్క అంటూ మితిమీరిన వ్యాఖ్య‌లు చేసింది. పిఠాపురం అభ్య‌ర్ధి వంగా గీత త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. గీత ఆల్రెడీ గెలిచేసార‌ని.. ఎన్నిక‌ల్లో ఎంత మెజారిటీ వ‌స్తుంద‌ని మాత్ర‌మే చూడాల‌ని ఓవ‌రాక్ష‌న్ చేసారు. తీరా పార్టీ 11 సీట్ల‌కే ప‌రిమితం అవ్వ‌డంతో సోష‌ల్ మీడియా మొత్తం యాంక‌ర్ శ్యామ‌ల‌పై ధ్వ‌జ‌మెత్తారు. ఆమెకు యాంక‌రింగ్, సినీ అవ‌కాశాలు కూడా పూర్తిగా త‌గ్గిపోయాయి.  ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్యామ‌ల‌కు పార్టీ అధికారిక ప్ర‌తినిధి హోదా క‌ల్పించింది.