SVSN Varma: YSRCPలోకి పిఠాపురం వ‌ర్మ‌?

SVSN Varma: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) త‌ర‌ఫున పిఠాపురం నుంచి పోటీ చేయాల్సిన ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌కు చివ‌రి నిమిషంలో షాక్ త‌గిలింది. ఈ స్థానం నుంచి జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌ (Pawan Kalyan) పోటీ చేస్తుండ‌డంతో వ‌ర్మ‌కు ఒళ్లు మండింది.

దాంతో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసైనా స‌రే ఒంట‌రిగా బ‌రిలోకి దిగాల‌నుకున్నాడు. ఆ త‌ర్వాత పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పిలిపించి నచ్చ‌జెప్పి ఓ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో అత‌ను ప‌వ‌న్ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మ‌రో ట్విస్ట్ బ‌య‌టికి వ‌చ్చింది. చివ‌రి నిమిషంలో వ‌ర్మ తెలుగు దేశం పార్టీకి కూట‌మికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో రెండు రోజుల్లో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.