SVSN Varma: డైమండ్ రాణి ఆంటీ ఎక్కడ కనిపించడం లేదు?
SVSN Varma: పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా అవాక్కులు చవాక్కులు పేల్చిందని.. కానీ పిఠాపురం ప్రజలు గేటు బద్దలుకొట్టుకుని ధైర్యంగా లోపలికి వెళ్లు అని తీర్పు ఇచ్చారని అన్నారు తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. పవన్‌ను పట్టుకుని నానా మాటలు అన్న డైమండ్ ఆంటీ మాత్రం ఈరోజు ఓడిపోయి కనీసం ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఓ మనిషిని పట్టుకుని అనే ముందు వారు ఏంటి ఎలా గౌరవించాలనేది తెలిసి ఉండాలని ఆ సంస్కారం జగన్ మోహన్ రెడ్డికి ఆయన కిందివారికి కానీ లేవని అన్నారు.