SVSN Varma: జనసైనికులు కాదు.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గం దాడి చేయించింది
SVSN Varma: తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మపై నిన్న రాత్రి దాడి జరిగింది. పిఠాపురంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండుగులు రాళ్లు రువ్వి దాడి చేసారు. గొల్లప్రోలులోని వన్నెపూడిలో ఈ దాడి చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పుణ్యమా అని ఆయన ప్రాణాలతో బయటపడ్డారనే చెప్పాలి. అయితే ఇది జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కానీ జనసైనికులకు కానీ సంబంధం లేని విషయం అని.. జనసేన తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ వర్గం పని అయ్యుంటుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.