Rahul gandhi: రాహుల్‌ అప్పీల్ తిర‌స్క‌ర‌ణ‌

Surat: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)కి సూర‌త్ కోర్టులో చుక్కెదురైంది. గుజ‌రాత్‌లోని సూర‌త్(surat) కోర్టులో  ప‌రువు న‌ష్టం కేసులో త‌న‌కు విధించిన శిక్ష‌ను నిలిపివేయాలంటూ రాహుల్ వేసిన పిటిష‌న్‌ను రిజెక్ట్ చేసింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారం స‌మయంలో క‌ర్ణాట‌క‌లోని కోలార్ ప్రాంతంలో రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అని రాహుల్ అన‌డంతో గుజ‌రాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూర‌త్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసారు. సుదీర్ఘ విచార‌ణల త‌ర్వాత రాహుల్ అలా అన‌డం త‌ప్పేన‌ని కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ఇందుకు ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో రాహుల్‌పై పార్ల‌మెంట్‌లో అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఈ నేప‌థ్యంలో రాహుల్ సూర‌త్ కోర్టులో కేవ‌లం ఒక్క మాట వ‌ల్ల రెండేళ్లు జైలు శిక్ష స‌బ‌బు కాద‌ని, తీర్పును కొట్టివేయాల‌ని అప్పీల్ చేసుకున్నారు. కానీ ఇందుకు సూర‌త్ కోర్టు నిరాక‌రించింది. త‌ర్వాత రాహుల్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి.