New Parliament Building: మాకు సంబంధం లేదని చెప్పిన సుప్రీంకోర్టు

Delhi: కొత్త పార్ల‌మెంట్‌పై (New Parliament Building) ప్రారంభోత్స‌వ వివాదంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది . పార్ల‌మెంట్ ప్రారంభించే హక్కు రాష్ట్ర‌ప‌తికి (president) మాత్ర‌మే ఉంటుంద‌ని, చ‌ట్టాలు మార్చి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (modi) ఎలా ప్రారంభిస్తారంటూ ప్ర‌తిప‌క్షాలు, విప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్ప‌టికే దాదాపు 19 పార్టీలు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి రావ‌డంలేద‌ని తేల్చి చెప్పారు. మోదీ కొత్త పార్ల‌మెంట్‌ను ప్రారంభిస్తే చూస్తూ ఊరుకోమ‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముని (president draupadi murmu) ఈవెంట్‌కు పిల‌వ‌కుండా ఆమె స్థానాన్ని అగౌర‌వ‌ప‌రుస్తున్నారంటూ సీఆర్ జ‌య సుకిన్ (cr jaya sukin) అనే న్యాయ‌వాది సుప్రీంకోర్టులో (supreme court) పిటిష‌న్ వేసారు. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు తీర్పు వెల్ల‌డిస్తూ..తాము ఈ విష‌యంలో క‌ల‌గ‌జేసుకోలేమంటూ పిటిష‌న్ కొట్టిపారేసింది.

ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనం (New Parliament) ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి (president) కాకుండా ప్రధానమంత్రి మోదీ (modi) పార్లమెంటు భవనాన్ని (new parliament) ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని… పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 20 విపక్ష పార్టీలు (Opposition parties) ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ వేడుక‌కు 25 పార్టీలు హాజ‌రుకానున్నాయి.

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన పార్టీల్లో… కాంగ్రెస్ (congress), DMK, AAP, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ (samajwadi), సీపీఐ (cpi), జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్ (tmc), జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ (ncp), సీపీఎం (cpm), ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి.