కౌంటింగ్ సెంటర్ల దరిదాపుల్లోకి వచ్చావో.. పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్
Pinnelli Ramakrishna: ఎన్నికల కౌంటింగ్‌కు ఒక్కరోజు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రేపు కౌంటింగ్ సెంటర్ల దరిదాపుల్లో కనిపించినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది. ఈవీఎం బద్దలుకొట్టడమే కాకుండా అక్కడున్న అధికారులు మహిళా ఓటరు పట్ల దురుసుగా ప్రవర్తించిన పిన్నెళ్లిని వెంటనే అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసిందే కాకుండా.. జూన్ 6 వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిన్నెళ్లికి ముందస్తు బెయిల్ ఇచ్చి జూన్ 6 వరకు అరెస్ట్ చేయకూడదు అని హైకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని.. ఇది చట్టాలను కించపరచడమే అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.